రాజమౌళి దర్శకత్వంలో? | rana daggubati next film with ss rajamouli | Sakshi
Sakshi News home page

రాజమౌళి దర్శకత్వంలో?

Mar 20 2020 5:59 AM | Updated on Mar 20 2020 5:59 AM

rana daggubati next film with ss rajamouli - Sakshi

భల్లాలదేవగా ‘బాహుబలి’ సినిమాలో రానా నటన సూపర్‌ హిట్‌. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా చేసిన భల్లాలదేవ పాత్ర విలన్‌. అయితే ఇప్పుడు రానాయే హీరోగా రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో రాజమౌళి ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. అలాగే ‘విరాటపర్వం’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రానా. అలాగే తేజ, గుణశేఖర్‌ (హిరణ్యకశ్యప) దర్శకత్వాల్లో రానా హీరోగా సినిమాలు రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. మరి రాజమౌళి దర్శకత్వంలో రానా హీరోగా సినిమా ఉంటుందా? వేచి చూడాల్సిందే.

వెబ్‌ సిరీస్‌లో?
‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ సినిమాల విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ ఓ వెబ్‌సిరీస్‌ కోసం కథను రెడీ చేస్తున్నారట. ఇందులో రానా నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement