స్పీడు పెంచుతున్న రామ్ చరణ్ | Ramcharan planing 2 films per year | Sakshi
Sakshi News home page

స్పీడు పెంచుతున్న రామ్ చరణ్

Nov 24 2015 9:20 AM | Updated on Sep 3 2017 12:57 PM

స్పీడు పెంచుతున్న రామ్ చరణ్

స్పీడు పెంచుతున్న రామ్ చరణ్

బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ తరువాత ఫారిన్ ట్రిప్లో ఉన్న రామ్ చరణ్, అక్కడి నుంచే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నాడు. ఇన్నాళ్లు చిరు 150వ సినిమా కోసం నెమ్మదిగా సినిమాలు అంగీకరిస్తూ...

బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ తరువాత ఫారిన్ ట్రిప్లో ఉన్న రామ్ చరణ్, అక్కడి నుంచే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నాడు. ఇన్నాళ్లు చిరు 150వ సినిమా కోసం నెమ్మదిగా సినిమాలు అంగీకరిస్తూ వస్తున్న చెర్రీ, ఆ విషయం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించకపోవటంతో ఇక వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో తను కమిట్ అయిన సినిమాలనే వరుసగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు చెర్రీ.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ తిరిగి రాగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న, గౌతమ్ మీనన్ సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలను 2016లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు కథ, దర్శకులు ఫైనల్ కాకపోయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే లోపు యువి క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement