లవ్‌ లాక్‌

Ramcharan And Upasana Kamineni Valentines Day  - Sakshi

ఫిబ్రవరి 14... ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులంతా తాము ప్రేమించిన వారిపై ప్రేమను రకరకాల రూపాల్లో చూపిస్తుంటారు. కొందరు గిఫ్ట్స్‌ ఇచ్చి, కొందరు సర్‌ప్రైజ్‌లు ఇచ్చి, ఒక్కొక్కరు ఒక్కోలా. ఎవరు ఎలా ప్రేమను చూపించినా కూడా ఆ ప్రేమను చిరకాలం జ్ఞాపకంగా మార్చుకోవటానికే. రామ్‌చరణ్, ఆయన వైఫ్‌ ఉపాసన కూడా ఈ వేలంటైన్స్‌ డేను ఆస్ట్రియాలో ఆ దేశ స్టైల్లోనే జరుపుకున్నారు. ‘రంగస్థలం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని హాలిడేకు వెళ్లిన రామ్‌చరణ్‌ దంపతులు వాళ్ల ప్రేమను లాక్‌ చేసుకున్నారు.

ప్రేమను లాక్‌ చేసుకోవటం ఏంటీ? అనుకుంటున్నారా... లవ్‌ను లాక్‌ చేసుకోవటమే ఆస్ట్రియాలోని ‘సాల్జ్‌బర్గ్‌  లవ్‌ లాక్‌ బ్రిడ్జ్‌’ ప్రత్యేకత. ఆ బ్రిడ్జ్‌  మీద ఇద్దరి ప్రేమికుల పేర్లను ఒక లాక్‌ (తాళం కప్ప) పై రాసి, దాన్ని ఆ బ్రిడ్జ్‌కి సైడ్‌ ఉన్న ఫెన్స్‌కు లాక్‌ చేసి, ఆ కీను ఆ నదిలో పారేస్తారట. అలా చేస్తే వారి ప్రేమ  విడదీయలేని బంధంగా మారుతుందని నమ్ముతారట. ఉపాసన కూడా ఉప్సీ–రామ్‌ అంటూ ఓ లాక్‌పై రాసి వేలంటైన్స్‌ డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఫొటోలో ఉప్సీ–రామ్‌ అని రాసి ఉన్న తాళం కనిపిస్తోంది కదా. అదే ఈ జంట లవ్‌ లాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top