మోదీ రియల్ సర్కార్ : వర్మ | Ram Gopal Varma reaction to Modi announcement | Sakshi
Sakshi News home page

మోదీ రియల్ సర్కార్ : వర్మ

Nov 22 2016 12:12 PM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీ రియల్ సర్కార్ : వర్మ - Sakshi

మోదీ రియల్ సర్కార్ : వర్మ

సినిమా విశేషాలపైనే కాదు సమకాలీన రాజకీయాలపైన కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల వర్మ.

సినిమా విశేషాలపైనే కాదు సమకాలీన రాజకీయాలపైన కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల వర్మ. ఇటీవల పెద్ద నోట్ల రద్దు విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దుతు తెలిపిన రాం గోపాల్ వర్మ, తాజాగా మోదీ ఫోటోను ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోలో కూడా తన పైత్యం చూపించాడు ఈ గ్రేట్ డైరెక్టర్. తను రూపొందించిన సర్కార్ సినిమాలో అమితాబ్ గెటప్కు మోదీ తలను అతికించి ఆ ఫోటోను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు.

ఫోటో కింద రీల్ వర్సెస్ రియల్ అన్న కామెంట్ను చూస్తే అమితాబ్ తెర మీద సర్కార్ అయితే, మోదీ నిజ జీవితంలో సర్కార్ అన్న అర్ధ వచ్చేలా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ మోనార్క్ల వ్యవహరించే సర్కార్ పాత్రలో మోదీని చూపించటంలో వర్మ ఉద్దేశమేంటో ఆయన చెపితేనే గాని సామన్యులకు అర్ధమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఫోటోతోనే సరిపెట్టిన వర్మ, ఆ ఫోటోకు సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement