
ఆఫీసర్ సినిమాలో నాగార్జున
వరుస డిజాస్టర్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సీనియర్ హీరోగా నాగార్జున లీడ్ రోల్లో తెరకెక్కిస్తున్న సినిమా ఆఫీసర్. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. వర్మ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాతో మైరా సరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఇప్పటికే రెండు టీజర్లను రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా రెండు నిమిషాల నిడివితో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వర్మ మార్క్ యాక్షన్‌తో రూపొందించిన ఈ ట్రైలర్లో నాగార్జున్ స్టైలిష్ కాప్‌గా ఆకట్టుకున్నాడు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వర్మ.