
రామ్‌చరణ్‌కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు జపాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. మార్చి 27న చరణ్ 34వ పుట్టినరోజును జరుపుకున్నారు. జపాన్ అభిమానుల నుంచి చరణ్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. ఆయన నటించిన ‘మగధీర’ చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్’ అని రాసి పంపించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ గ్రీటింగ్ కార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చరణ్ ‘‘జపాన్ నుంచి స్వీట్ సర్‌ప్రైజ్‌ను అందుకున్నా. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్ అభిమానులకు నా ప్రేమను పంచుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ జపాన్’ అన్నారు.