
రకుల్ ప్రీత్, సెల్వరాఘవన్
ఒక సినిమా సెట్ నుంచి మరో సినిమా సెట్స్‌కు పరుగులు తీయడం హీరోయిన్స్ రొటీన్‌లో భాగం. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌కు చెన్నై వీడ్కోలు చెప్పగానే ముంబై వెల్కమ్ చెప్పింది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యన్‌జీకే’. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు రకుల్. ‘‘జీనియస్ సెల్వరాఘవన్ సార్‌తో పని చేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. మీ అందరికీ సినిమా ఎప్పుడు చూపించాలా అని ఎదురు చూస్తున్నాను. హిందీ సినిమా ‘మర్జావా’ షూటింగ్‌కు కోసం ముంబై పిలిచింది’’ అని పేర్కొన్నారు రకుల్. చెన్నైకు టాటా చెప్పగానే ముంబై రకుల్‌కు వెల్కమ్ చెప్పిందన్నమాట.