‘ఎన్‌జీకే’కు ప్యాకప్‌ చెప్పిన రకుల్‌! | Rakul Preet Wrap Up For NGK Movie | Sakshi
Sakshi News home page

Jan 28 2019 6:18 PM | Updated on Jan 28 2019 6:18 PM

Rakul Preet Wrap Up For NGK Movie - Sakshi

తక్కువ కాలంలోనే టాప్‌స్టార్స్‌ అందరితో నటించింది రకుల్‌ప్రీత్‌. టాప్‌ హీరోయిన్‌ కొనసాగుతున్న సమయంలోనే.. సరైన సక్సెస్‌లేక వెనుకబడిపోయింది. ఈ మధ్య కాలంలో రకుల్‌కు చెప్పుకోదగ్గ విజయం రాలేదు. అయినా చేతినిండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది రకుల్‌. 

రకుల్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్య సరసన ఎన్జీకే, కార్తీకి జోడిగా దేవ్‌ చిత్రంలో నటిస్తూ బిజీగాఉంది. బాలీవుడ్‌లో సిద్దార్థ్‌ మల్హోత్ర మర్జావాన్‌ మూవీ చేస్తోంది. ఈ మధ్య ఎన్టీఆర్‌ కథానాయకుడు మూవీలో శ్రీదేవి పాత్రలో మెరిసింది. 

ప్రస్తుతం రకుల​ ఎన్జీకే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పినట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘ఎన్జీకేకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని, సెల్వరాఘవన్‌, సూర్యలతో పని చేయడం అద్భుతమైన ఫీలింగ్‌ను ఇచ్చిందని, వీరి వద్దనుంచి ఎంతో నేర్చుకున్నానని, ఎన్జీకే చిత్రం కోసం ఎదురుచూస్తానని, మళ్లీ మర్జావాన్‌ షూటింగ్‌కు వెళ్తున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement