చిన్నోడైనా వాడినే పెళ్లి చేసుకుంటా! | Rakul Preet Singh Talk About Her Marriage | Sakshi
Sakshi News home page

నచ్చితే చిన్నోడైనా పెళ్లి చేసుకుంటా!

May 9 2019 7:58 AM | Updated on May 28 2019 10:06 AM

Rakul Preet Singh Talk About Her Marriage - Sakshi

చెన్నై : సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వార్తే అవుతుంది. ఈ ఉత్తరాది భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌ అందుకు అతీతం కాదు. కోలీవుడ్‌కు కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి మొదట్లో ఇక్కడ చుక్కెదురైంది. అయితే అనుకోకుండా టాలీవుడ్‌ రకుల్‌ను ఆదుకుంది. అక్కడ వరుసగా అవకాశాలు రావడం, అందులో కొన్ని చిత్రాలు సక్సెస్‌ అవుడంతో రకుల్‌ మంచి మార్కెట్‌నే అందుకుంది. అయితే ఈమె జోరు అక్కడా ఎక్కువ కాలం సాగలేదు. ఇటీవల కొన్ని బిగ్‌ ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఇక కోలీవుడ్‌లో ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం ఈ అమ్మడికి సక్సెస్‌ రుచి చూపించినా, ఆ తరువాత ఆ చిత్ర కథానాయకుడు కార్తీతోనే నటించిన దేవ్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ప్రస్తుతం నటుడు సూర్యతో రొమాన్స్‌ చేసిన ఎన్‌జీకే చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 31న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఇది కాకుండా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో రకుల్‌ రొమాన్స్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ తాను మొదట్లో చాలా తప్పులు చేశానని చెప్పింది. అయితే అందుకు తానేమీ బాధ పడడంలేదని అంది. కారణం చేసిన తప్పులను పాఠంగా తీసుకుంటే జీవితంలో ఎదగగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విజయాల విలువ తెలియాలంటే అపజయాలను ఎదుర్కోవాలని అంది. నటి కావాలని ఎంతో మంది ఆశ పడుతుంటారని, అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని అంది. ఇకపోతే పెళ్లి గురించి అడుగుతున్నారని, ప్రేమలో పడడానికి తానూ ఎదురు చూస్తున్నానని చెప్పింది. నచ్చిన వాడు తారసపడితే వెంటనే ప్రేమించి పెళ్లాడేస్తానని తెలి పింది. కాబోయే జీవిత భాగస్వామి ఎలాంటి వాడై ఉండాలన్న ప్రశ్నకు, ప్రేమకు వయసుతో పని లేదని అతగాడు వయసులో చిన్నవాడా, పెద్దవాడా అన్నది చూడనని, నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా ఇదే రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇంతకు ముందు తనను పెళ్లాడే వాడు ఆరడుగుల అందగాడై ఉండాలని పేర్కొందన్నది గమనార్హం. ఇకపోతే ఈ జాణ ఆరడుగుల పొడుగైన ఒక టాలీవుడ్‌ నటుడితో డేటింగ్‌లో ఉందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతున్నాయన్నది గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement