శ్రీదేవి లేదు.. నాకు బతకాలని లేదు: నటి | Rakhi Sawant Gets Heavily Trolled for Her Tearful Video oOn Sridevis Demise | Sakshi
Sakshi News home page

నాకు బతకాలని లేదు: నటి

Mar 2 2018 12:54 PM | Updated on Mar 2 2018 4:43 PM

Rakhi Sawant Gets Heavily Trolled for Her Tearful Video oOn Sridevis Demise - Sakshi

శ్రీదేవి అకాల మరణాన్నిఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం అందరిపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ కూడా శ్రీదేవికి అభిమాని. అతిలోక సుందరి అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికింది. అనంతరం శ్రీదేవి మరణం తనును ఎంతో కలిచివేసిందని ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది.

'శ్రీదేవి జీ! మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్‌ యూ సో మచ్‌. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు.. లవ్‌ యూ ’ అంటూ బాధతో వీడియో పోస్టు పెట్టింది.

అయితే రాఖీ సావంత్‌ పోస్టులకు నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. 'ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌, టీఆర్‌పీ కోసం చేస్తున్నావ్‌.., రాఖీ, కామెడీ చేయకు.., వీడియోలో నువ్వు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నావ్‌.., టూ ఫన్సీ.. అంటూ కామెంట్లు పెట్టారు. శ్రీదేవి మరణం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీదేవి ఫొటోలతో నింపిన రాఖీ.. తాజాగా శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి పాత వీడియోని పోస్ట్‌ చేసింది. శ్రీదేవి మళ్లీ పుట్టారని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement