మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్‌ బ్యూటీ ..వరుడు ఎవరంటే..? | Rakhi Sawant Plans Her Third Marriage | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్‌ బ్యూటీ ..వరుడు ఎవరంటే..?

Jan 28 2025 5:57 PM | Updated on Jan 28 2025 6:18 PM

Rakhi Sawant Plans Her Third Marriage

రాఖీ సావంత్‌(Rakhi Sawant).. బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సోషల్‌ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈమె సుపరిచితమే. అప్పట్లో ప్రత్యేక పాటలకు కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అంద, అభినయంతో బాలీవుడ్‌లొ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షో(Bigg Boss Show)లోకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్ అయింది. ఆమె ఏ పోస్ట్‌ పెట్టిన నిమిషాల్లో వైరల్‌ అవుతున్నాయి. సినిమాల కంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఆమెకు వార్తల్లో నిలుస్తోంది. 

పిచ్చి చేష్టలు..వివాదస్పద ప్రకటనలు చేస్తూ నెట్టింట ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న రాఖీ సావంత్‌..తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం మూడో భర్తతో స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్‌కు వెల్లనున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ బాలీవుడ్‌ బ్యూటీ మొదట వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్‌ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement