‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’ - Sakshi


హైదరాబాద్‌ : ‘ఆత్మను అస్త్రములు, శస్త్రములు చేధింపజాలవు, నీరు తడుపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయు సామర్థనీయముకాదు’ అంటూ ఆత్మలక్షణాలను చెబుతూ రాజుగారి గది 2 ట్రైలర్‌ వచ్చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అక్కినేని నాగార్జున చిత్ర యూనిట్‌ ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. మరోసారి ఓంకార్‌ ఈ చిత్రంలో తనదైన మార్క్‌ను చూపించినట్లు తెలుస్తోంది. ’రేయ్‌.. మన రిసార్టులో దెయ్యం’ ఉందిరా అంటూ వెన్నెల కిషోర్‌ ఫ్రెండ్స్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆధ్యంతం ఉత్కంఠను రేపింది.ఇక యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరింది. ఓ యజ్ఞం జరిపిస్తూ ఆత్మ సమస్య నుంచి బయటపడేసే ఓ మెంటలిస్టుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నారు. రుద్రాక్ష మాలతో జపం చేస్తూ కళ్లు మూసుకొని ఆత్మ శోధన చేస్తూ కనిపించిన తీరు బాగుంది. ​‍‘ఒకమ్మాయి ఆత్మ పగతో ఉంది, అది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది’ అనే డైలాగ్‌ చెప్పిన నాగార్జున ఈ సినిమాలో నేరుగా ఆత్మతో మాట్లాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అనిపిస్తుంది. మొత్తానికి హారర్‌, సస్పెన్స్‌, విజువలవండర్‌గా ఈ సినిమా కనిపించబోతున్నట్లు ట్రైలర్‌ ద్వారా స్పష్టమైపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అక్టోబర్‌ 13వరకు ఆగాల్సిందే మరి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top