‘సర్కార్‌’ వేడుకకు రజనీ

Rajinikanth Will Be Cheif Guest For Sarkar Audio Launch - Sakshi

కోలీవుడ్ టాప్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కార్‌. గతంలో వీరి కాంబినేషన్‌ లో తెరకెక్కిన తుపాకి, కత్తి సినిమాలు ఘన విజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సన్‌ పిక్చర్స్‌ భారీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను అక్టోబర్‌ 2న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. ఇద్దరు సూపర్‌ స్టార్లు ఒకే వేదికపైకి రానుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనాల వేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చెపాక్‌ స్టేడియంకు పర్మిషన్ రాని పక్షంలో నెహ్రూ ఇండోర్‌ స్టేడియం లేదా వైఎమ్‌సీఏ స్టేడియాలలో ఒకదానిని ఫైనల్‌ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top