'ముండసుపత్తి'ని ప్రశంసలతో ముంచెత్తిన రజనీకాంత్ | Rajinikanth lauds 'Mundasupatti' | Sakshi
Sakshi News home page

'ముండసుపత్తి'ని ప్రశంసలతో ముంచెత్తిన రజనీకాంత్

Jun 16 2014 1:05 PM | Updated on Sep 2 2017 8:54 AM

'ముండసుపత్తి'ని ప్రశంసలతో ముంచెత్తిన రజనీకాంత్

'ముండసుపత్తి'ని ప్రశంసలతో ముంచెత్తిన రజనీకాంత్

ఇటీవల విడుదలైన తమిళ కామెడీ చిత్రం 'ముండసుపత్తి'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

చెన్నై: ఇటీవల విడుదలైన తమిళ కామెడీ చిత్రం 'ముండసుపత్తి'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించిన చిత్ర నిర్మాతలపై, దర్శకులను, ప్రధాన పాత్రధారులను పొగడ్తలతో ముంచెత్తారు.
 
మూఢ నమ్మకాల నేపథ్యంలో ఓ గ్రామంలోని ఓ కథను 'ముండసుపత్తి'గా రూపొందించారు. ఈచిత్రంలో  విష్టు విశాల్, నందితా, రాందాస్, కాళి వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. 
 
'ముండసుపత్తి' చిత్రం బాగా నచ్చింది. ముఖ్యంగా విష్ణు, రాందాస్, కాళిల నటనల ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సీవీ కుమార్, ఫాక్స్ స్టార్ స్టూడియో ఇండియాలు అభినందనలు అని రజనీ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
గత శుక్రవారం విడుదలైన 'ముండసుపత్తి' విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement