'ముండసుపత్తి'ని ప్రశంసలతో ముంచెత్తిన రజనీకాంత్
చెన్నై: ఇటీవల విడుదలైన తమిళ కామెడీ చిత్రం 'ముండసుపత్తి'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించిన చిత్ర నిర్మాతలపై, దర్శకులను, ప్రధాన పాత్రధారులను పొగడ్తలతో ముంచెత్తారు.
మూఢ నమ్మకాల నేపథ్యంలో ఓ గ్రామంలోని ఓ కథను 'ముండసుపత్తి'గా రూపొందించారు. ఈచిత్రంలో విష్టు విశాల్, నందితా, రాందాస్, కాళి వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు.
'ముండసుపత్తి' చిత్రం బాగా నచ్చింది. ముఖ్యంగా విష్ణు, రాందాస్, కాళిల నటనల ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సీవీ కుమార్, ఫాక్స్ స్టార్ స్టూడియో ఇండియాలు అభినందనలు అని రజనీ ఓ ప్రకటనలో తెలిపారు.
గత శుక్రవారం విడుదలైన 'ముండసుపత్తి' విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.