ఫారిన్‌ టూర్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Rajamouli Tweet About Washington Tour - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో ఉన్న దర్శకుడు రాజమౌళి వాషింగ్టన్‌కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ తానా సభలు జరుగుతుండటంతో రాజమౌళి ఆ సభలలో పాల్గొనేందుకు వాషింగ్టన్‌ వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో రాజమౌళి తన టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘నేను కేవలం వ్యక్తిగత పనుల మీద మాత్రమే వాషింగ్టన్‌ వచ్చాను. తానా సభల కోసం కాదు. పెద్దన్న (సంగీత దర్శకుడు కీరవాణి) మ్యూజికల్‌ షోలో కూడా నేను పాల్గొనటం లేదు. అభిమానులు నేను వేడుకలకు హాజరవుతానని ఆశించి నిరాశచెందవద్దు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

బాహుబలి తరువాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టారర్‌ ఆర్ఆర్‌ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది. ఇద్దరు హీరోలు గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన రాజమౌళి, ఇటీవలే తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top