యుద్దం ముగించిన రాజమౌళి! | Rajamouli completes shooting war sequence for 'Baahubali' | Sakshi
Sakshi News home page

యుద్దం ముగించిన రాజమౌళి!

Apr 7 2014 2:35 PM | Updated on Jul 14 2019 4:05 PM

యుద్దం ముగించిన రాజమౌళి! - Sakshi

యుద్దం ముగించిన రాజమౌళి!

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి చిత్రంలోని యుద్దానికి సంబంధించిన పోరాట సన్నివేశాల చిత్రీకరణను సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ముగించారు.

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి చిత్రంలోని యుద్దానికి సంబంధించిన పోరాట సన్నివేశాల చిత్రీకరణను సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ముగించారు. గత కొద్దికాలంగా  హాలీవుడ్ స్థాయికి తగినట్టు యుద్ధపోరాటాల చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. బహుబలి చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సహకారం మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నారు. 
 
యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన అత్యధిక భాగం పూర్తి చేసాం. షెడ్యూల్ సుధీర్ఘంగా సాగింది. సన్నివేశాలను విజయవంతంగా పూర్తి చేయడంలో యూనిట్ పూర్తిగా సహకరించింది. చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పనిచేశారు. వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు అని అన్నారు. విశాఖ పట్నంలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నామని.. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 2015లో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement