రాజ్ తరుణ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ | Raj Tarun Next movie Title Andagadu | Sakshi
Sakshi News home page

రాజ్ తరుణ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

Nov 17 2016 11:48 AM | Updated on Sep 4 2017 8:22 PM

రాజ్ తరుణ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

రాజ్ తరుణ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో...

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలో నటిస్తున్న రాజ్ తరుణ్, అదే సమయంలో మరో సినిమాను కూడా పూర్తి చేసేస్తున్నాడు.  వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమాలో దాదాపు ఇంటర్వెల్ వరకు రాజ్ తరుణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడు. హేబా పటేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు 'అందగాడు' అనే టైటిల్ను ఫైనల్ చేశారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి 2017 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement