చాటింగ్‌తో చీటింగ్‌ | Rahman Oru Mugathirai To Be Released In Telugu | Sakshi
Sakshi News home page

చాటింగ్‌తో చీటింగ్‌

May 25 2018 4:55 AM | Updated on Jul 12 2019 4:40 PM

Rahman Oru Mugathirai To Be Released In Telugu - Sakshi

రహమాన్‌

సీనియర్‌ నటుడు రహమాన్‌ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్‌ నాథన్‌ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్‌ సత్యమూర్తి’ పేరుతో యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై డి. వెంకటేశ్‌ జూన్‌ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాటలు రిలీజ్‌ చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు ట్రైలర్‌ ఆవిష్కరించారు. డి.వెంకటేశ్‌  మాట్లాడుతూ– ‘‘సోషల్‌ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాట్సప్, ఫేస్‌బుక్‌ ఐడీస్‌లో  వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్‌ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ మూవీ. మంచి మెసేజ్‌ ఉంది’’ అన్నారు. ‘‘సోషల్‌ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్‌ హెరాస్‌మెంట్, అన్‌మెచ్యూర్డ్‌ మైండ్స్‌తో ఏ విధంగా మోసపోతున్నారు? అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? అనే నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు రహమాన్‌. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement