ప్రేమలో పడిపోయారు! | Pyar mein Padipoyane Movie adio release on 13th april | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడిపోయారు!

Apr 6 2014 11:32 PM | Updated on Sep 2 2017 5:40 AM

ప్రేమలో పడిపోయారు!

ప్రేమలో పడిపోయారు!

ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్

ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 13న పాటలను, 25న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీ తీద్దామనుకుంటున్న సమయంలో రవి చావలి ఈ కథ చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం చేశాం. ఇప్పటివరకు ఆది నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు. ఇదొక మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని, చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement