సమంతకు సవాల్‌ విసిరిన పీవీ సింధూ..!

PV Sindhu Give A Challenge On Planting Saplings To Actress Samantha - Sakshi

హీరోయిన్‌ సమంతకు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సిందూ చాలెంజ్‌ విసిరారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ‘గ్రీన్‌ చాలెంజ్‌’ పేరిట మొక్కలను నాటుతూ ఒకిరికొకరు సవాల్‌ చేసుకుంటున్నారు. తాజాగా క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నుంచి గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన సింధూ శనివారం మూడు మొక్కలు నాటి హరిత సవాల్‌ని బాక్సింగ్‌ స్టార్‌ మేరీ కోమ్‌, హీరో సూర్య, సమంతకు పాస్‌ చేశారు. గ్రీన్‌ చాలెంజ్‌కు తనను నామినేట్‌ చేసిన లక్ష్మణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

భూమిని పచ్చగా ఉంచేందుకు అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు ఆమె ట్వీట్‌ చేశారు. కాగా, ఇటీవల చైనాలో జరిగిన బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సింధూ సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వంశీ పైడిపల్లి విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సమంత స్వీకరించలేకపోయింది. యూటర్న్‌ చిత్రంతో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్న సమంత సింధూ విసిరిన ఈ సవాల్‌నైనా స్వీకరిస్తుందో లేదో చూడాలి..! 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top