ప్రియాంకకు అరుదైన అవకాశం | Priyanka Chopra Will be Presenting at the Oscars This Year | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు అరుదైన అవకాశం

Feb 2 2016 10:02 AM | Updated on Sep 3 2017 4:49 PM

ప్రియాంకకు అరుదైన అవకాశం

ప్రియాంకకు అరుదైన అవకాశం

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో అరుదైన అవకాశం దక్కించుకుంది.

లాజ్ ఏంజెలెస్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రెజెంటర్ గా వ్యవహరించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. ఈ విషయాన్ని 'ది అకాడమీ' ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ప్రెజెంటర్స్ గా వ్యవహరించే 13 మంది పేర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 28 సాయంత్రం(భారత కాలమాన ప్రకారం 29 తెల్లవారుజామున) అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

ఈ అవకాశం దక్కడం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. 33 ఏళ్ల ఈ బాలీవుడ్ భామ అమెరికా టీవీ షో 'క్వాంటికో'లో అలెక్స్ పర్రిస్ పాత్ర దక్కించుకోవడంతో ఆమె పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఈ షోలో ఆమె నటనకు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. 'క్వాంటికో' సిరీస్ రెండో భాగం షూటింగ్ లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో నటనకు గానూ ఫిలింపేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును ఇటీవల అందుకున్న ప్రియాంక.. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో 'జై గంగాజల్'లోనూ నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement