మొబైల్‌లో కొత్త షో! | Priyanka Chopra ventures into mobile series ‘It’s My City’ | Sakshi
Sakshi News home page

మొబైల్‌లో కొత్త షో!

Jan 22 2016 11:13 PM | Updated on Sep 3 2017 4:07 PM

మొబైల్‌లో కొత్త షో!

మొబైల్‌లో కొత్త షో!

కథానాయికగా వెండితెరపై దూసుకెళుతున్న ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకున్నారు.

కథానాయికగా వెండితెరపై దూసుకెళుతున్న ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ మొబి-సిరీస్‌లో కూడా హల్‌చల్ చేయనున్నారు. అంటే.. మొబైల్ ఫోన్లో వచ్చే సిరీస్ అన్నమాట. ముంబైలో ఓ ఫ్లాట్‌లోనివసించే నలుగురు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఆ నలుగురి అమ్మాయిలకు గార్డియన్‌గా ప్రియాంక స్పెషల్ రోల్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు... ఈ సిరీస్‌ను ఆమే స్వయంగా నిర్మించడం విశేషం.

‘ఇట్స్ మై సిటీ’ పేరుతో రూపొంద నున్న ఈ సిరీస్ మొత్తం 14 ఎపిసోడ్స్‌గా సాగుతుంది. వారానికి రెండుసార్లు ప్రసారమవుతుంది. ‘‘ఈ సిరీస్ స్టోరీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఏదో సాధించాలనే తపనతో, ఎన్నో కలలతో ఒకప్పుడు నేను ముంబైలో అడుగుపెట్టిన రోజులు గుర్తుకొస్తు న్నాయి. నేను మాత్రమే కాదు... చాలామంది ఈ కథతో రిలేట్ అవుతారు. నేటి తరం వారికి స్ఫూర్తినివ్వాలనే ఆకాంక్షతోనే ఈ మొబి-సిరీస్ ప్లాన్ చేశాను. ఇవాళ మొబైల్ ఫోన్ లేని కుర్రకారు ఉండరు కదా. అందరూ మొబైల్‌లో చూడచ్చు’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement