‘ఎవరు అందంగా ఉన్నారు.. కాదు నువ్వే అందంగా ఉన్నావు’

Priyanka Chopra Shares A Video While Swimming With Her Cute Niece And Watch Sweet Debate - Sakshi

సినిమా షూటింగ్‌లతో, బిజినెస్‌ ఈవెంట్‌లతో బిజీ బిజీగా ఉండే గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకాకు కాస్త విరామం దొరికనట్లుగా ఉంది. ఏ మాత్రం కూడా ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తన మేనకోడలు స్కై కృష్ణాతో స్విమ్మింగ్‌ చేస్తూ సరదాగా గడుపుడుతన్న ప్రియాంక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ వీడియోలో స్విమ్మింగ్‌ సూట్‌లో ప్రియాంక ఇంకా తన మేనకోడలు కృష్ణాలు ముద్దు ముద్దుగా ఉన్నారంటూ నేటిజన్లు కామెంట్‌లు పెడుతున్నారు.  అలాగే స్విమ్మింగ్‌ ఫూల్‌ ఉన్న వారిద్దరు.. ఎవరు అందంగా ఉన్నారు.. నువ్వే చాలా అందంగా ఉన్నావు కాదు నువ్వే చాలా క్యూట్‌గా ఉన్నావు’  అంటూ వాదించుకుంటున్న ఈ వీడియోకు ప్రియాంక సన్నీహితులు హర్ట్‌ ఇమోజీలతో కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. కాగా క్యూబాకు చెందిన అమెరికా నటుడు అనాబెల్లె అకోస్టా ‘ తను చాలా పెద్దది అంటూ కామెంట్‌ చేయగా సోషలైట్‌ నటుడైన పారిస్‌ హిల్టన్‌ కళ్లలో హర్ట్‌ ఉండే ఎమోజీని పెట్టాడు.

ఇక సినిమాల విషయానికోస్తే ఈ గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ దీ స్కై ఇజ్‌ పింక్‌’  అక్టోబర్‌ మొదటి వారంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రియాంక రోగనిరోధక శక్తి లోపంతో జన్మించిన అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించారు. ఇది గురుగాన్‌కు చెందిన ఐశా చౌదరి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఐశా తన ఆరోగ్యం క్షిణించే వరకు తన కుటుంబంతో కలిసి ఈ వ్యాధిని తగ్గించడానికి 2015 వరకు పోరాటం చేస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంకతోపాటు ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వసీం కూడా నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top