‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

Priyanka Chopra Shares a Video In Social Media On Nick Jonas Birthday - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ గ్లోబల్‌ కపుల్‌ ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లిన వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అందాల భామ ప్రియాంక  సోమవారం తన భర్త నిక్‌ బర్త్‌ డే సందర్భంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రియాంక పెళ్లయిన తర్వాత నిక్‌ మొదటి బర్త్‌ డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు ప్రియాంక. గతంలో వారు సరదాగా, ఆనందంగా గడిపిన  సమయంలో తీసుకున్న ఫోటోలన్నింటిని వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ‘నీతో ఉండే ప్రతి రోజు ఓ కొత్త అనుభూతిని పొందుతాను.. నువ్వు నా జీవితానికి వెలుగువి, ప్రపంచంలోని అన్ని ఆనందాలకు నువ్వు అర్హుడివి నిక్‌, హ్యాపీ బర్త్‌ డే మై జాన్‌’ అంటూ హృదయాన్ని తాకే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు.

ఈ వీడియోలో ప్రియంక నిక్‌లు కలిసి సరదాగా వంట చేస్తున్న క్లిప్స్‌, కొన్ని ప్రైవేట్‌ కార్యక్రమాలలో వారు చేసిన అల్లరి ఫోటోలతో పాటు ప్రియాంక బర్త్‌ డేలో సందడి చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ది స్కై ఇజ్‌ పింక్‌’ ప్రమోషన్‌ వేడుక టొరంటోలో జరిగింది. అలాగే టొరంటోలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ది స్కై ఇజ్‌ పింక్‌ చిత్ర దర్శకుడైన సోనలీ బోస్‌, కో స్టార్స్‌ ఫర్హాన్‌ అక్తర్‌, రోహిత్‌ సరఫ్‌లతో కలిసి ప్రియాంక హజరయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top