
ఇందులో ఓ కిక్కుంది
అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘గూండే’ చిత్రం షూటింగ్ సమయంలో
‘‘అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘గూండే’ చిత్రం షూటింగ్ సమయంలో ‘క్వాంటికో’ యూనిట్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నా. అమెరికన్ టీవీ ధారావాహికల్లో భారతీయుల పాత్రల తీరుతెన్నులు చాలా రొటీన్‌గా ఉంటున్నాయి. ఈ ‘క్వాంటికో’ టీవీ సిరీస్ మాత్రం అందుకు భిన్నం. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.
వాళ్లకి ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పా. నన్ను ఓ బాలీవుడ్ నటిగా కాకుండా, ఓ మంచి నటిగా మాత్రమే చూడమన్నా. ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఇండియన్స్ అనేసరికి కొన్ని రకాల పాత్రలే చేయగ లుగుతారని ఫిక్స్ అయిపోయారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టడానికే ఈ పాత్ర ఒప్పుకున్నా. పైగా ఇందులో నేను మాట్లాడే ఇంగ్లిష్, అమెరికన్ యాసకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా కొత్తగా ఉంటుంది. ఓ అమెరికన్ యువతి పాత్రలో నటించడంలో చాలా కిక్కుంది.’’
- ప్రియాంకా చోప్రా