ప్రియాంక కొత్త ఇంటికి రూ.144 కోట్లు?

Priyanka Chopra Nick Jonas Shell Out Rs 144 Crores For New House - Sakshi

ముంబై: ఇటు బాలీవుడ్‌, అటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. నిక్‌ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక తన కొత్త ఇంటి కోసం ఏకంగా రూ. 144 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు లాస్‌ఏంజెలెస్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్‌ ఇంట్లో ఈ జంట నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని అమ్మేసి ఓ కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకున్నారు. ఈ క్రమంలో లాస్‌ఏంజెలెస్‌లోని ఎన్సివో ప్రాంతంలోని విలాసవంతమైన ఓ ఇల్లును ప్రియాంక, నిక్‌  జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు). అలాగే నూతన భవనం కోసం నిక్‌ ఆగస్టులో తన బ్యాచిలర్‌ పాడ్‌ను కూడా అమ్మేశాడని వార్తలు వెలువడుతున్నాయి. ఇక కొత్త ఇంటి కొనుగోలుతో లాస్‌ఏంజెలెస్‌లో స్థానిక రియల్‌ ఎస్టేట్‌ రికార్డులను ప్రియాంక-నిక్‌ జంట బద్దలు కొట్టినట్లు సమాచారం.  

ఈ ఇంటిలో ఏడు బెడ్‌ రూమ్‌లు, 11 బాత్‌రూమ్‌లు, ఇంటి ముందు విశాలమైన స్థలంతోపాటు అత్యాధునికమైన వసతులలో కూడిన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిక్‌ సోదరుడు జో జోనస్‌ అతడి భార్య సోఫియో టర్నర్‌ సుమారు రూ. 101 కోట్లు(14.1) మిలియన్లు ఖర్చు చేసి నిక్‌ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో మరో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘కొత్త ఇళ్లు కొనుక్కోవడం, పిల్లలకు జన్మనివ్వడం ప్రస్తుతం నా లిస్టులో ఉన్న విషయాలు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. రాబోయే పదేళ్లలో కచ్చితంగా పిల్లలను కంటాను. నాకంటూ పిల్లలను కలిగి ఉండటమే నా డ్రీమ్‌’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ‘స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రియాంక ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావుతో ‘వైట్‌ టైగర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top