బిగ్‌బీ స్థానాన్ని పీసీ ఎగరేసుకుపోయిందా? | priyanka chopra may be brought in place of amitabh for incredible india brand ambassador | Sakshi
Sakshi News home page

బిగ్‌బీ స్థానాన్ని పీసీ ఎగరేసుకుపోయిందా?

Apr 20 2016 1:15 PM | Updated on Sep 3 2017 10:21 PM

బిగ్‌బీ స్థానాన్ని పీసీ ఎగరేసుకుపోయిందా?

బిగ్‌బీ స్థానాన్ని పీసీ ఎగరేసుకుపోయిందా?

పనామా పేపర్స్‌లో పేరు కనిపించడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోల్పోయిన స్థానాన్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఎగరేసుకుపోతోందట.

పనామా పేపర్స్‌లో పేరు కనిపించడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోల్పోయిన స్థానాన్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఎగరేసుకుపోతోందట. ఇన్‌క్రెడిబుల్ ఇండియా (అతుల్య భారత్) బ్రాండ్ అంబాసిడర్‌గా మొదట్లో అమీర్‌ఖాన్ ఉండేవాడు. అయితే.. అసహనం గురించిన వ్యాఖ్యల కారణంగా ఆయన కాంట్రాక్టును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పొడిగించలేదు. తర్వాత అమితాబ్, ప్రియాంకల మధ్య దాని కోసం పోటీ ఏర్పడంది. కానీ, ఇటీవలే పనామా పేపర్స్‌లో అమితాబ్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని పెద్దాయన చెప్పినా, అంతర్జాతీయంగా భారత బ్రాండ్ ఇమేజికి ఇబ్బంది ఉండకూదదని పర్యాటక శాఖ భావించిందని సమాచారం.

దానికితోడు.. ప్రియాంకా చోప్రా అయితే ఈమధ్య క్వాంటికో, బేవాచ్‌ లాంటి సీరియళ్లతో హాలీవుడ్‌కు కూడా వెళ్లింది కాబట్టి ఆమె అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారట. దాంతో అమ్మడి పేరు దాదాపుగా ఖాయం చేసినట్లేనని చెబుతున్నారు. ప్రియాంకను ఈ కార్యక్రమానికి ప్రతినిధిగా చూపిస్తే.. భారతదేశం మహిళలకు అంత సురక్షితం కాదన్న ప్రచారాన్ని ఖండించడానికి కూడా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. వీటన్నింటి గురించి ప్రచారం జరుగుతున్నా... అసలు అమితాబ్ పేరును పక్కకు పెట్టినట్లు, ప్రియాంకను తెరమీదకు తీసుకొచ్చినట్లు వస్తున్న వాదనలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement