ప్రియమణి విలనిజం | Priyamani interested in Negative roles | Sakshi
Sakshi News home page

ప్రియమణి విలనిజం

Sep 12 2013 2:00 PM | Updated on Sep 1 2017 10:39 PM

ప్రియమణి విలనిజం

ప్రియమణి విలనిజం

అందంతో పాటు అభినయం పుష్కలంగా ఉన్నా ప్రియమణికి అదృష్టం కలిసి రావటం లేదు. దాంతో రూట్ మార్చిన అమ్మడు ఇప్పుడు ప్రతినాయకి పాత్రలకు రెడీ అంటోంది.

అందంతో పాటు అభినయం పుష్కలంగా ఉన్నా ప్రియమణికి అదృష్టం కలిసి రావటం లేదు. 'పరుత్తివీరన్' చిత్రంలో జాతీయ స్థాయిలోఉత్తమ నటన ప్రదర్శించినా ఆమె కెరీర్ మాత్రం ఆశించినంతగా లేదు. తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నా ప్రియమణికి అవేమీ కలిసి రావటం లేదు. ఇటీవలి ఒకటి... రెండు చిత్రాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసింది. అయినా అవి కూడా ఆమెకు అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయాయి. దాంతో ప్రియమణి రూట్ మార్చుతోంది. ఇప్పుడు తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించేందుకు తహతహలాడుతోంది. ప్రతినాయకి పాత్రలు  చేసేందుకు సైతం రెడీ అంటోంది.  

జాతీయ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత ప్రియమణికి అదే తరహా పాత్రేలే ఆమెకు వచ్చాయి. దాంతో ఆ ముద్ర నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఎక్స్‌పోజింగ్‌కూ సై అని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్లామర్ పాత్రలు పోషించినా అవకాశాలు ముఖం చాటేశాయి. దీంతో ఈ అమ్మడు తెలుగు చిత్రసీమపై కన్నేసింది. ఇక్కడ కూడా 'పెళ్లైన కొత్తలో' 'యమదొంగ' లాంటి కొన్ని హిట్ చిత్రాలను తన ఖాతాలో జమ చేసుకుంది.


నితిన్ హీరోగా నటించిన 'ద్రోణ' చిత్రంలో ఈత దుస్తులతో కనిపించి అందాలను తెరపై ఆరబోసి ఔరా అనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఫలితం లేకపోయింది. ఇటీవల హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ అవకాశం ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలని చూసిన ప్రియమణికి చుక్కెదురైందని చెప్పవచ్చు. ఐటమ్‌సాంగ్‌ల వరకు ఓకే... హీరోయిన్ పాత్రలు అడగవద్దనే సమాధానం ఆమెకు లభిస్తోందట. దీంతో ప్రియమణి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. చాలెంజింగ్‌తో కూడిన ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సిద్ధమంటూ దర్శక,నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది.

మరోవైపు అతి త్వరలోనే మెగాఫోన్‌ పట్టుకునేందుకు తాను ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రియమణి చెబుతోంది. దర్శత్వం చేయాలన్నది తన కలని, ఆ కలను నెరవేర్చుకునేందుకు తాను ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నానని ప్రియమణి చెప్పుకొస్తున్నది. హీరోలు కూడా తమ మార్కెట్ తగ్గగానే ... విలన్ పాత్రలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. అదే రూట్లోనూ ప్రియమణి వెళుతోంది. మరి ఆమెకు దర్శక, నిర్మాతలు ఏమేరకు అవకాశాలు ఇస్తారో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement