ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ– ‘దిల్‌’ రాజు | Prematho Mee Karthik Movie Song Launch | Sakshi
Sakshi News home page

ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ– ‘దిల్‌’ రాజు

Oct 3 2017 12:34 AM | Updated on Oct 3 2017 3:16 AM

Prematho Mee Karthik Movie Song Launch

‘‘ఈ చిత్రకథ నాకు తెలుసు. మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ. ఈ పాటలో సాహిత్యం, చిత్రీకరణ విధానం బాగుంది. మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మంచి హిట్టవ్వాలని కోరుకుంటూ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. కార్తీకేయ, సిమ్రత్‌ జంటగా రిషి దర్శకత్వంలో రవీందర్‌ ఆర్‌.

గుమ్మడికొండ నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమా తొలి పాటను ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. రిషి మాట్లాడుతూ– ‘‘క్లీన్‌ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మా చిన్న చిత్రానికి ‘దిల్‌’ రాజు అండ దొరకడం మా అదృష్టం’’ అన్నారు. ‘‘మా అన్నయ్య కొడుకు కార్తికేయ పుణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్‌ తీసుకుని, ఒకట్రెండు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించాడు.

సెకండ్‌ హీరో, ఇతర అవకాశాలు రావడంతో వద్దని నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా’’ అన్నారు రవీందర్‌ ఆర్‌. గుమ్మడికొండ. ‘‘త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు లైన్‌ ప్రొడ్యూసర్‌ అశోక్‌రెడ్డి గుమ్మడికొండ. కార్తికేయ, మైత్రిమూవీస్‌ నవీన్‌ ఎర్నేని పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రమణ శ్రీ గుమ్మడికొండ, గీతా మన్నం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement