లుక్‌ కిరాక్‌! | Pre-look poster of Nikhil Siddharth's 'Kirik Party' remake out | Sakshi
Sakshi News home page

లుక్‌ కిరాక్‌!

Dec 3 2017 1:22 AM | Updated on Dec 3 2017 1:22 AM

Pre-look poster of Nikhil Siddharth's 'Kirik Party' remake out - Sakshi

వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్‌ ఏర్పరచుకున్న యువ కథానాయకుడు నిఖిల్‌. ఆయన నటిస్తోన్న 15వ చిత్రం ‘కిర్రాక్‌ పార్టీ’. సంయుక్తా హెగ్డే, సిమ్రన్‌ పరీన్జా కథానాయికలు. శరన్‌ కొప్పిశెట్టిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఏ.కె.ఎంటరై్టన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని శనివారం విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘కళాశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. క్యాస్టింగ్‌ కాల్‌ నిర్వహించగా సుమారు 60 వేల అప్లికేషన్‌లు వచ్చాయి.

ఆడిషన్స్‌ చేసి కొంతమందిని ఎంపిక చేశాం. 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. నిఖిల్‌తో ‘స్వామి రారా’ తీసిన సుధీర్‌వర్మ మా చిత్రానికి స్క్రీన్‌ ప్లే  అందించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి మాటలు రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఫస్ట్‌ లుక్‌కి రెస్పాన్స్‌ కిరాక్‌’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోకనాథ్, కెమెరా: అద్వైత గురుమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర–అభిషేక్‌ అగర్వాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement