కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్‌ | Sakshi
Sakshi News home page

కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్‌

Published Sun, Mar 4 2018 12:37 AM

Pratani Ramakrishna Goud pressmeet - Sakshi

‘‘సౌత్‌ ఫిల్మ్‌ చాంబర్‌ మెంబర్స్‌ అందరూ కలిసికట్టుగా 10 వేల థియేటర్స్‌ను బంద్‌ చేయటం రికార్డ్‌. ఈ బంద్‌కు సహకరించిన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్‌ కార్మికులు.. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సిసి) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌. డిజిటల్‌ సర్వీస్‌ (క్యూబ్, యూఎఫ్‌ఒ, పీఎక్స్‌డి) ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణ చలన చిత్రనిర్మాతలు థియేటర్‌ మూతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ధియేటర్స్‌ క్లోజ్‌ అయ్యాయి. శనివారం ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ – ‘‘డిజిటల్‌ వ్యవస్థపై పోరాటం చేస్తూ అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీదకు రావటం చాలా గ్రేట్‌. హిందీ సినిమాలకు ఇది వర్తించదు. బట్‌ వాళ్లు కూడా బంద్‌ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వారు ఐదేళ్ల తర్వాత ఫ్రీ సర్వీస్‌ ఇస్తాం అని అగ్రిమెంట్‌ చేసి, ఇప్పుడు అధికంగా వసూలు చేస్తున్నారు. అగ్రిమెంట్‌కు కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి. మేం కొత్త సర్వీస్‌ ప్రొవైడర్స్‌ను తెచ్చుకుంటాం. ఇది తేలే వరకు బంద్‌ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. ‘‘డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ 5 ఏళ్లే అగ్రిమెంట్‌ అని చెప్పి 13 సంవత్సరాలుగా నిర్మాతల రక్తాన్ని పీల్చుకుంటున్నారు. కోట్ల లాభాలు ఆర్జించారు. ఈ బంద్‌ను కంటిన్యూ చేయాలి. ఇది వారం రోజులైనా పది రోజులైనా ఒకే మాట మీద ఉందాం. చార్జీలు కొంత వరకు పెట్టినా ఓకే కానీ చిన్న సినిమాలకు జీరోగా నిర్ణయించాలి’’ అని టీఎఫ్‌íసీసీ సెక్రటరీ సాయి వెంకట్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement