ప్రకాశ్‌ రాజ్‌ మాటే సాక్ష్యం | prakash raj voice over for saakshyam movie | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌ రాజ్‌ మాటే సాక్ష్యం

Jul 21 2018 12:47 AM | Updated on Aug 22 2019 9:35 AM

prakash raj voice over for saakshyam movie - Sakshi

ప్రకాశ్‌ రాజ్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘కథాగమనానికి వాయిస్‌ ఓవర్‌ చాలా కీలకం.

అందుకే ఎవరైనా సీనియర్‌ ఆర్టిస్ట్‌ వాయిస్‌ ఓవర్‌ చెబితే బాగుంటుందని భావించిన శ్రీవాస్‌ స్వయంగా ప్రకాశ్‌రాజ్‌గారిని సంప్రదించగా ఆయన సమ్మతించారు. ఆయన మాట సినిమాలో చాలా కీలకపాత్ర పోషించనుంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వరన్, కెమెరా: ఆర్థర్‌ ఏ. విల్సన్‌.

Advertisement
 
Advertisement
Advertisement