అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు! | Prakash Raj replaces Raj Kiran in Charan film leads to additional budget | Sakshi
Sakshi News home page

అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!

Sep 30 2014 12:36 PM | Updated on Sep 2 2017 2:11 PM

అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!

అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!

ప్రకాశ్రాజ్ కోసం అదనంగా రూ. 2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు చెర్రీ.

విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఆయన తమ సినిమాలో నటించాలని కోరుకుని హీరోలు అరుదు. హీరో రామ్చరణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రకాశ్రాజ్ కోసం అదనంగా రూ. 2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
 

చరణ్ తాజాగా నటించిన 'గోవిందు అందరివాడేలే'లో తాత పాత్రకు ముందుగా రాజ్కిరణ్ ను తీసుకున్నారు. చిత్రీకరణ్ సమయంలో సంతృప్తి కలగకపోవడంతో రాజ్కిరణ్ ను తీసేసి ఆయన స్థానంలో ప్రకాశ్రాజ్ను తీసుకున్నారు. ఇందుకోసం రూ. 2 కోట్లు అదనంగా ఖర్చయిందని చరణ్ వెల్లడించాడు. అయితే రూ. పదికోట్లకు సమానంగా ప్రయోజనం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెర్రీ నమ్మకం నిజమవుతుందో, లేదో ప్రేక్షకులే తేల్చాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement