రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం? | police to arrest Ram Gopal Varma? | Sakshi
Sakshi News home page

రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Feb 16 2018 8:25 AM | Updated on Feb 16 2018 12:42 PM

police to arrest Ram Gopal Varma? - Sakshi

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చా వేదికలో తనను రాంగోపాల్‌ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని  ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.  దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న వర్మను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కాగా రాంగోపాల్‌ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement