అద్భుతమైన ఆరంభం ఇది! | Pilla Nuvvu Leni Jeevitham Movie Success Meet | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ఆరంభం ఇది!

Nov 18 2014 10:17 PM | Updated on Sep 2 2017 4:41 PM

అద్భుతమైన ఆరంభం ఇది!

అద్భుతమైన ఆరంభం ఇది!

రవికుమార్ చౌదరి స్క్రీన్‌ప్లే కొత్తగా ఉందని సినిమా నిర్మాణంలో ఉన్నప్పట్నుంచీ నేను చెబుతూనే ఉన్నాను. చివరకు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అదే అయ్యింది.

 ‘‘రవికుమార్ చౌదరి స్క్రీన్‌ప్లే కొత్తగా ఉందని సినిమా నిర్మాణంలో ఉన్నప్పట్నుంచీ నేను చెబుతూనే ఉన్నాను. చివరకు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అదే అయ్యింది. సాయిధరమ్‌తేజ్‌కి అద్భుతమైన ఆరంభాన్నిచ్చిందీ సినిమా. జగపతిబాబు ప్రత్యేక పాత్ర చేసి సినిమాను నిలబెట్టారు’’ అని అల్లు అరవింద్ అన్నారు. ఆయన సమర్పణలో సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్నీ వాస్, శ్రీహర్షిత్ కలిసి నిర్మించిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. అతిథు లుగా పాల్గొన్న దర్శకులు బోయపాటి శ్రీను, హరీశ్‌శంకర్, పైడిపల్లి వంశీ, మారుతి చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సాయిధరమ్ తేజ్, ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, జగపతిబాబు, రెజీనాలతో పాటు చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement