దర్శకత్వం అంటే పిచ్చి | Pichhodu Movie updates | Sakshi
Sakshi News home page

దర్శకత్వం అంటే పిచ్చి

Nov 22 2019 5:20 AM | Updated on Nov 22 2019 5:20 AM

Pichhodu Movie updates - Sakshi

క్రాంతి, కె. సీమర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్‌ శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ –‘‘మాది కామారెడ్డి. ఇంతకుముందు కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేశాను. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిని ఇష్టాన్ని మించి ప్రేమిస్తారు. నాకు డైరెక్షన్‌ అంటే పిచ్చి.

మా సినిమాలో హీరోకి తన కోసం పుట్టిన సోల్‌మేట్‌ను వెతుక్కోవడమే పిచ్చి. అందుకే ‘పిచ్చోడు’ అనే టైటిల్‌ పెట్టాం. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాను. ప్రేక్షకులకు చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్ని కథలు రాసుకుంటున్నాను. ఓ మల్టీస్టారర్‌ కథ కూడా ఉంది’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement