పెళ్లి చూపులు దర్శకుడి కొత్త సినిమా అప్‌డేట్‌

Director Tarun Bhaskar - Sakshi

గత ఏడాది సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో ఘనవిజయం సాధించిన తరుణ్ తన రెండో సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతా కొత్తవారితో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లిచూపులు సినిమాకు సంగీతమందించిన వివేక్‌ సాగర్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా రోడ్‌ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. త్వరలో చిత్రయూనిట్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top