తరుణ్ కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమయింది..?’

Pelli Choopulu Fame Tarun Bhaskar next film - Sakshi

తొలి చిత్రంగా తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్.

తన రెండో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుందని తెలిపినా. అది ఎప్పుడు మొదలవుతుందో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తరుణ్ భాస్కర్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తన రెండో సినిమాకు తరణ్ ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించాడట. ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే ‘ ఈ నగరానికి ఏమయింది..?’అనే మాటలనే తన టైటిల్ గా ఎంచుకున్నాడట తరుణ్ భాస్కర్‌. త‍్వరలోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top