‘ఎన్టీఆర్‌’లో ‘ఆర్‌ఎక్స్‌100’ భామ!

Payal Rajput May Acts As Jayasudha In NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటిస్తోన్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. నందమూరి తారకరామారావు జీవిత గాథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. సినీ జీవితాన్ని కథానాయకుడిగా, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

ఎన్టీఆర్‌ సినీ జీవితానికి సంబంధించిన భాగాన్ని ప్రస్తుతం షూట్‌ చేస్తోండగా.. ఇందులో ఇప్పటికే పలుతారలు జాయిన్‌ అయ్యారు. అలనాటి అందాల తార శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మహానటి సావిత్రిగా నిత్యా మీనన్‌, జయప్రద పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. మరికొన్ని పాత్రలకు ఇంకొంత మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సహజనటి జయసుధ పాత్రలో ‘ఆర్‌ఎక్స్‌100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జయసుధ కాంబినేషన్‌లో వచ్చిన డ్రైవర్‌ రాముడు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా వీరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలు వచ్చాయి. ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. డైరెక్టర్‌ క్రిష్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top