మూడో పెళ్లిపై స్పందించిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan clarifies about his third marriage | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లిపై స్పందించిన పవన్ కళ్యాణ్

Feb 19 2014 7:59 PM | Updated on Mar 22 2019 5:33 PM

మూడో పెళ్లిపై స్పందించిన పవన్ కళ్యాణ్ - Sakshi

మూడో పెళ్లిపై స్పందించిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో వివాహంపై తొలిసారిగా స్పందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో వివాహంపై తొలిసారిగా స్పందించారు. రష్యన్ మోడల్‌  అన్నా లెజ్నెవా (డానా మార్క్స్)ను పెళ్లాడిన విషయాన్ని చాలా రోజుల పాటు ఆయన రహస్యంగా ఉంచారు. గత ఏడాది సెప్టెంబరు 30న జరిగిన పవన్ కళ్యాణ్- అన్నా లెజ్నెవా పెళ్లి సుమారు మూడు నెలల తర్వాత వెలుగు చూసింది. దీంతో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పెళ్లిపై చర్చలు నడిచాయి. అయితే పవన్ మాత్రం దీనిపై పెదవి విప్పలేదు.

ప్రముఖ మేగజీన్ ఇండియాటుడే తాజాగా ప్రచురించిన కథనంలో తన మూడో పెళ్లిపై పవన్ స్పందించాడు. అది తన వ్యక్తిగత విషయమని వెల్లడించాడు. తన వైవాహిక జీవితం గురించి బయట మాట్లాడలేనని స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పమని కోరగా... 'వ్యక్తిగత జీవితం అని మీరే అంటున్నారుగా, దాన్ని అలాగే ఉంచేద్దాం' అంటూ పవన్ జవాబిచ్చాడు. అన్నా లెజ్నెవాను పెళ్లాడడానికి దారి తీసిన పరిస్థితుల గురించి పవన్ ఇప్పటికీ పెదవి విప్పలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గబ్బర్ సింగ్ 2, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement