
'పటాస్'.. బాగా పేలింది!
అటు నటుడిగాను, ఇటు నిర్మాతగాను ఎన్నాళ్ల నుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్కు పటాస్ రూపంలో మంచి హిట్ దొరికింది.
అటు నటుడిగాను, ఇటు నిర్మాతగాను ఎన్నాళ్ల నుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్కు పటాస్ రూపంలో మంచి హిట్ దొరికింది. ఓపెనింగ్ వారాంతంలోనే ఇది రూ. 8 కోట్ల వసూళ్లు సాధించింది. పెద్దగా అంచనాలు లేకపోయినా.. సైలెంట్ హిట్గా ఇది దూసుకెళ్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కేవలం డబ్బులు రావడమే కాదు, థియేటర్లలో షోల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా మొదటి వారాంతంలో రూ. 8 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ లో బడ్జెట్ సినిమా వసూలు చేసింది. సోమవారం నుంచి కూడా షోలు బాగున్నాయని త్రినాథ్ తెలిపారు. అనిల్ రావిపూడి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతి సోధి హీరోయిన్గా చేసింది. ఇంకా అశుతోష్ రాణా, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, దివంగత ఎంఎస్ నారాయణ కూడా నటించారు. అవినీతికి అలవాటు పడిపోయిన పోలీసు అధికారిగా కళ్యాణ్ రామ్ నటించాడు. డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా కీలకపాత్ర పోషించారు. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించిన జయీభవ, కత్తి, ఓం 3డి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టినా.. ఈ సినిమా విజయంతో తేరుకున్నాడు.