పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ | Pakistan win Oscar for Best Documentary-Short Subject | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్

Feb 29 2016 10:52 AM | Updated on Sep 3 2017 6:42 PM

పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్

పాకిస్థాన్ డాక్యుమెంటరీకి ఆస్కార్

ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల్లో పాకిస్థాన్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది.

లాస్ ఏంజెలెస్: ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల్లో పాకిస్థాన్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. 88వ అకాడమీ అవార్డుల్లో 'ఏ గాల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్ గివ్ నెస్' ఉత్తమ డాక్యుమెంటరీ-షార్ట్ సబ్జెక్ట్ గా ఎంపికైంది. పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్ షర్మీన్ ఒబైడ్-చినాయ్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. పరువు హత్యలు నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.

ఇది తనకు దక్కిన రెండో ఆస్కార్ పురస్కారమని చినాయ్ తెలిపారు. అంతకుముందు 2012లో 'సేవింగ్ ఫేస్'కు ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు. పాకిస్థాన్ యాసిడ్ బాధితులకు సంబంధించిన కథాంశంతో 'సేవింగ్ ఫేస్' తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement