ఆపరేషన్‌ దుర్యోధన తరహాలో.. | 'Operation 2019' sees special roles by two heroes | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ దుర్యోధన తరహాలో..

Sep 15 2018 12:49 AM | Updated on Sep 15 2018 12:49 AM

'Operation 2019' sees special roles by two heroes - Sakshi

శ్రీకాంత్‌

శ్రీకాంత్‌ హీరోగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణం బాబ్జి దర్శకత్వంలో అలివేలు నిర్మించిన  చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. మంచు మనోజ్, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ర్యాప్‌ రాక్‌ షకీల్‌ స్వరపరచిన ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు కరణం బాబ్జి దర్శకత్వంలో ‘మెంటల్‌ పోలీస్‌’ సినిమా చేశా. తాజాగా రాజకీయ నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమా  డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ఆపరేషన్‌ దుర్యోధన’ తర్వాత మళ్లీ మంచి పాత్ర చేశాననే తృప్తి కలిగింది’’ అన్నారు.

సునీల్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్‌ అన్నయ్య నటించిన ‘ఆపరేషన్‌ దుర్యోధన’ నా ఫేవరేట్‌ సినిమా. 2019లో ఎలా ఉండాలనుకుంటున్నామన్నది 2018లోనే తెలియచేస్తున్నామని శ్రీకాంత్‌ అన్నయ్య నాతో అన్నారు. నేనీ సినిమాలో కనిపించే సందర్భం ప్రేక్షకులకు షాకింగ్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత డ్యాన్స్‌ చేసే అవకాశం కలిగించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘చెన్నైలో జరిగిన ఘటన ఆధారంగా సినిమా స్టార్ట్‌ చేశాను. సునీల్‌ గారు కథ వినగానే ఓకే అన్నారు. మనోజ్‌ కథ వినగానే ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది. చేస్తా’ అన్నారు. ‘ఆపరేషన్‌ దుర్యోధన’ క్యారెక్టరైజేషన్‌ ఈ సినిమాలో కనబడుతుంది’’ అన్నారు కరణం బాబ్జీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement