ఆ హర్రర్‌ సినిమాకు మరో సీక్వెల్‌ | Sakshi
Sakshi News home page

త్వరలో ‘రాజుగారి గది 3’

Published Sun, Apr 1 2018 1:18 PM

Ohmkar confirms Raju Gari Gadhi 3 - Sakshi

బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓం కార్ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటాడు. జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో నాగార్జున లాంటి స్టార్ హీరోతో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఓంకార్ ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

కానీ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అవుతున్నాడు ఓంకార్. సిక్త్స్‌ సెన్స్‌ అనే రియాలిటీషోకు వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్నాడు. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఓంకార్ సినిమాలను పక్కన పెట్టే ఉద్దేశం లేదని తెలిపాడు. త్వరలో రాజుగారి గది 3ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటించాడు ఓంకార్‌. అయితే ఈ సినిమానే బెల్లంకొండ హీరోగా తెరకెక్కిస్తాడా లేక..? మరో కథను రెడీ చేస్తాడా..? తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement