ఎన్టీఆర్తో మరోసారి..? | NTR and Koratala Siva might team up again | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో మరోసారి..?

May 10 2017 11:00 AM | Updated on Sep 5 2017 10:51 AM

ఎన్టీఆర్తో మరోసారి..?

ఎన్టీఆర్తో మరోసారి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఒకసారి పనిచేసిన దర్శకులు మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటారు. గతంలో వివి వినాయక్, రాజమౌళి

యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఒకసారి పనిచేసిన దర్శకులు మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటారు. గతంలో వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్తో రెండు మూడు సినిమాలకు పనిచేశారు. అయితే తాజాగా ఈ లిస్ట్ మరో దర్శకుడు చేరబోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివ, మరోసారి జూనియర్ను డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. కొరటాల కూడా భరత్ అను నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహేష్ బాబు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత మరోసారి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement