పోటీ చేసే ఉద్దేశం లేదు | No intention to poll in the elections | Sakshi
Sakshi News home page

పోటీ చేసే ఉద్దేశం లేదు

Mar 11 2014 11:09 PM | Updated on Sep 2 2017 4:35 AM

పోటీ చేసే ఉద్దేశం లేదు

పోటీ చేసే ఉద్దేశం లేదు

‘‘రాష్ట్ర విభజన వల్ల కొందరు ఆనందంతో ఉంటే... ఇంకొందరు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి దిగడం సమంజసం కాదు’’ అని సుమన్ అన్నారు.

‘‘రాష్ట్ర విభజన వల్ల కొందరు ఆనందంతో ఉంటే... ఇంకొందరు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి దిగడం సమంజసం కాదు’’ అని సుమన్ అన్నారు. తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ... మంగళవారం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు సుమన్. ‘‘నేను ఏ పార్టీలోనూ లేను. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశమే ఉంటే.. స్వయంగా వెల్లడిస్తాను. వివిధ పార్టీల్లో ఉన్న నా మిత్రులు కూడా ప్రచారం చేయమని అడుగుతున్నారు. ఇప్పటివరకూ ఏ అభిప్రాయానికీ నేను రాలేదు’’ అని తెలిపారు. ఈ నెలాఖరు వరకూ బాలీవుడ్ ‘గబ్బర్’ షూటింగ్‌లో తాను బిజీగా ఉంటానని సుమన్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement