రొమాంటిక్ ఎంటర్‌టైనర్ | Ninne Korukunta movie a Romantic entertainer | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Jan 30 2015 11:10 PM | Updated on Sep 2 2017 8:32 PM

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

విజయ్ భాస్కర్, వివేక్, ఆనంద్, పూజిత ముఖ్య తారలుగా గణమురళి శరగడం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.

విజయ్ భాస్కర్, వివేక్, ఆనంద్, పూజిత ముఖ్య తారలుగా గణమురళి శరగడం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. తుమ్మల నవ్య, నిత్య సమర్పణలో మరిపి విద్యాసాగర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కేకే రాధామోహన్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకురాలు బి. జయ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.ఇది రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు తెలిపారు. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాశ్, పి.టి. మాధవ్, సంగీతం: ప్రణవ్.

Advertisement
 
Advertisement
Advertisement