ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్ | Nikhil Surya Vs Surya Movie Hattrick Success | Sakshi
Sakshi News home page

ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్

Mar 30 2015 11:12 PM | Updated on Sep 2 2017 11:36 PM

ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్

ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్

వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే

వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస విజయాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ‘హ్యాపీడేస్’తో ప్రారంభమైన నా కెరీర్ ‘స్వామి రారా’తో మంచి మలుపు తీసుకుంది. ఈ చిత్రం హీరోగా మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. భవిష్యత్తులో నేను చేసే చిత్రాలు కూడా జనరంజకంగా ఉండాలనుకుంటున్నాను.
 
 కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అన్నారు. నిఖిల్ నిర్మాతల హీరో అనీ, ‘సూర్య వర్సెస్ సూర్య’ విడుదలై 25 రోజులై, ఇంకా మంచి వసూళ్లు రాబడుతోందని ఆ చిత్రనిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. నిఖిల్ హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉందని ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. నిఖిల్ ఒప్పుకుంటే ‘కార్తికేయ’కు సీక్వెల్ తీస్తానని ఆ చిత్రదర్శకుడు చందు మొండేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైతన్యకృష్ణ, చక్రి చిగురుపాటి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రాజా రవీంద్ర, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement