నిహారిక కొత్త సినిమా ఓపెనింగ్‌ | Niharika Konidela New Movie Opening | Sakshi
Sakshi News home page

Jun 23 2018 12:33 PM | Updated on Aug 9 2018 7:30 PM

Niharika Konidela New Movie Opening - Sakshi

హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు మెగా హీరోయిన్‌ నిహారిక కొణిదెల కష్టపడుతున్నారు. ఒక్క మనసు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ, ఇటీవల స్పీడు పెంచారు. కోలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. సుమంత్‌ అశ్విన్‌కు జోడిగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్‌ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది.

హ్యాపీ వెడ్డింగ్‌ సెట్స్‌మీద ఉండగానే మరో రెండు సినిమాలను ప్రారంభించారు నిహారిక. శ్రియతో కలిసి నటిస్తున్న ఓ లేడీ ఓరియటెండ్ సినిమా ఇటీవల ప్రారంభం కాగా.. ఈరోజు (శనివారం) ఉదయం మరో సినిమాను ప్రారంభించారు. రాహుల్‌ విజయ్‌ హీరోగా  ప్రణీత్ బ్రహ్మండ‌ప‌ల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డిస్టిబ్యూషన్‌ రంగంలో మంచి అనుభవమున్న నిర్వాణ సినిమాస్‌ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement